SRD: గుమ్మడిదల మండల కేంద్రంలో దళితవాడలో పీఎం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గుమ్మడిదల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావలి ఐలయ్య ఆధ్వర్యంలో “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఇందులో భాగంగా గడపగడపకు వెళ్లి భారత రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు గౌడ్, రాంరెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి ఉదయ్ కుమార్ ఉన్నారు.