మహబూబ్ నగర్ మండలం రేగడిగడ్డ తాండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టపాసులు కాల్చే సమయంలో అవి పేలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.