SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని కట్టోజు నీరజ జాతీయ కథా రచన పోటీల్లో మొదటి స్థానం సాధించింది. బాలచెలిమి మాసపత్రిక, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో అక్కన్నపేట మండలం, నీరజ రచించిన “చెట్టు ఉపకారం” కథకు ఈ గౌరవం దక్కింది. పర్యావరణ దృక్పథం, మానవీయ విలువలు నేపథ్యంగా సాగిన ఈ కథను అధ్యాపకులు అభినందించారు.