MDK: చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల సర్వేను కలెక్టర్ మనో చౌదరి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవారికి అందేలా పని చేయాలన్నారు. అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పేదవారికి అన్యాయం జరిగితే ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.