NZB: పసుపు రైతుల సంక్షేమానికి పాటుపడాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డికి సూచించారు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్గా ఎన్నికైన గంగారెడ్డికి గోయల్ శుభాకాంక్షలు తెలిపారు.