SRD: పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత రాథోడ్ అన్నారు. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలోని అంగన్వాడీ -3 కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి తనిఖీ చేశారు. అదే విధంగా స్థానిక రికార్డులు పరిశీలించి సంబంధిత అంగన్వాడీ టీచర్ సావిత్రికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు అజీమ్ ప్రేమ్ జీ, మణికుమార్ ఉన్నారు.