KMM: ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పని వేళలు మార్చాలని TUCI ఏరియా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగు మార్పులు చేయాలన్నారు.