WNP: వరి కోత యంత్రాల యజమానులు రేట్లు పెంచితే ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే మేఘ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు మీ వరి పంట కోత సమయంలో యంత్రాల యజమానులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రేట్లు వసూలు చేస్తే వ్యవసాయ అధికారులకు గాని, ఆర్టీవో, పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలని కోరారు.