KMM: పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి నెలకోల్పాలని డీపీఆర్వో ఎం.ఏ.గౌస్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పుస్తకాలు చదవడం వల్ల మన వ్యక్తిత్వం పెంపొందుతుందని, చిన్నతనం నుంచే పిల్లలకు ఈ అలవాటు పెంచాలని ఆయన సూచించారు. గ్రంథాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.