VKB: కుల్కచర్ల మండలంలో జరిగిన విషాద ఘటనలో అమ్మానాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన చిన్నారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. క్షణికావేశంలో భార్యాబిడ్డలను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనాథగా మారిన ఆ చిన్నారిని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.