NRPT: వందల ఏళ్లుగా నివాసం ఉంటున్న పల్లెగడ్డ గ్రామస్తులకు దేవాదాయశాఖ వారు నోటీసులు ఏ విధంగా ఇస్తారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, రాము ప్రశ్నించారు. మంగళవారం బాధితులతో ఆయన మాట్లాడారు. గ్రామస్తులకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. గ్రామ కంఠం భూములు ఇల్లు నిర్మించుకుంటే దేవాదాయశాఖ నోటీసులు ఇవ్వడం ఏమిటన్నారు.