NZB: నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరద నీరు గ్రామాలను ముంచెత్తిందని, దీనిపై వారిపై చర్యలు తీసుకోవాలని బోధన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్వీనర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వరద ఉధృతిని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.