NLG: నామినేషన్లు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం నకిరేకల్ మండలం కట్టంగూర్, అయిటిపాముల గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణను ఆయన పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ స్వీకరణకు కేంద్రానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు.