NRML: కుక్కలు కోతుల బెడదకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గురువారం భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి మహిళలు మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్‌కి వినతి పత్రం అందించారు. కాలనీలలో తిరగాలంటే ఊర కుక్కల బెడదతో భయంగా ఉందని తెలిపారు. ఇప్పటికే రోడ్డు పై వెళ్తున్న పలువురికి కుక్కలు కాటేసేయని, కోతులు సైతం ఇండ్లలో చొరబడి వీర విహారం చేస్తున్నాయని కమిషనర్‌కి తెలిపారు.