MHBD: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. బతుకమ్మలతో సందడి చేసి, ఉయ్యాల పాటలు పాడారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతిరూపమని వారు పేర్కొన్నారు.