MDK: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన వినూత్న పథకం “యాత్ర దానం” ద్వారా సామాజిక సేవలో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో ఆర్టీసీ డీఎం సురేఖ, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి యాత్ర దానం కరపత్రాలను ఆవిష్కరించారు.