MHBD: తొర్రూర్ మండలం చౌల్ల తండాలో పదవ తరగతి చదువుతున్న బానోత్ ఐశ్వర్య(15) పది రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. శుక్రవారం కడుపు నొప్పి రావడంతో తన అమ్మమ్మ స్థానిక ఆర్ఎంపి సారయ్యకు చూపించడంతో, అతను ఇంజక్షన్ చేశాడు. కడుపు నొప్పి పెరగడంతో బాలిక మృతి చెందినట్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేందర్ సారయ్యపై కేసు నమోదు చేశారు.