WGL: దంతాలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్ ప్రారంభానికి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన భోజనాన్ని అందిస్తుందని తెలిపారు. భోజనంలో ఏమైనా సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చని అన్నారు.