AP: అమ్మ, చెల్లి వద్దు.. ఆస్తులే ముద్దంటున్న జగన్ మహిళలకేం చేస్తారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. అధికారం అప్పుల్లో ముంచడానికి కాదు.. అభివృద్ధికని గ్రహించాలని తెలిపారు. టీడీపీ క్రియాశీలక పాత్రతోనే అమరావతికి రైల్వే లైన్ సాకారమైందని పేర్కొన్నారు. జగన్కు ఆత్మసాక్షి ఉంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నారు. ఐదేళ్లలో కేసులు, సూట్కేసులు తప్ప అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు.