ASR: ఈనెల 25న పాడేరు ఐటీడీఏలో యధావిధిగా మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులకు సంబందించి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం తెలిపారు. రెగ్యులర్‌గా అందే ఫిర్యాదులతో పాటు, విపత్తులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా స్వీకరించడం జరుగుతుందన్నారు.