AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడారు. స్థానిక బోర్ల నీటిని ల్యాబ్‌కు పంపాలని, బోర్లను మూసి వేసి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు. దాచేపల్లిలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, సాధారణ పరిస్థితి వచ్చేవరకు నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.