AP: అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి జనవరి నెలాఖరులో టెండర్లు ఉంటాయని మంత్రి నారాయణ వెల్లడించారు. గత కాంట్రాక్టులు 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవాటిని పిలుస్తామని అన్నారు. నవంబర్, డిసెంటర్లో అన్ని పనులకు టెండర్లు వేస్తామన్నారు. 369 కి.మీ. ట్రంక్ రోడ్లు, లే అవుట్లకు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, కరకట్ట రోడ్డుకు టెండర్లకు పిలుస్తామని పేర్కొన్నారు.