ASR: కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ ధర్మవరం గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో గదబరి దేవతమ్మ అనే మహిళకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం అయిందని స్థానికులు తెలిపారు. ఇల్లు కాలి బూడిద కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తమకు నిలువ నీడ లేకుండా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.