NLR: కావలి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో యాభై శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడమే లక్ష్యంగా అందరం సమిష్టిగా కలసి పని చేద్దామని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కావలి పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.