TG: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో భారీ మోసం బయటపడింది. స్క్వేర్ యార్డ్స్ ఫామ్ హౌస్ విల్లాల పేరుతో 120 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్ విల్లాల కోసం పెట్టుబడి పెడితే రెట్టింపు ఇస్తామని మోసం చేశారని, స్థలాలు లేకపోయినా ఉన్నట్లు చూపి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో కంపెనీ యజమాని బైరా చంద్రశేఖర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.