NLR: ఇందుకూరుపేట మండలంలోని ఏడిఏ కార్యాలయంలో గురువారం ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలాంటి వరి రకాలు రైతు నాటుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఎరువులు, పురుగు మందులు ఎలా వాడాలి మొదలగు యాజమాన్య పద్ధతులను వివరించారు.