AP: మద్యం దుకాణం విషయంలో టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన సత్యసాయి జిల్లా, తాడిమర్రిలో జరిగింది. తాడిమర్రిలో మద్యం దుకాణం తెలంగాణ వ్యాపారి పొందాడు. దీంతో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మద్యం దుకాణం ఎలా నడుపుతావని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యాపారికి బీజేపీ నాయకులు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ రాజుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.