AP: పాలనా వ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకోనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ముంబయిలో భేటీ అయిన లోకేశ్.. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన జెన్సన్.. ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్‌లను ఎన్విడియా అందిస్తోందని వెల్లడించారు.