BDK: భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా శుక్రవారం తోటమల్ల రమ మండల విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. కాగా నూతన విద్యాశాఖ అధికారికి పలువురు ఉపాధ్యాయ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.