TG: వరంగల్లోని భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయి. అధికారులు చెరువులో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం చెరువు మత్తడి వద్ద నిన్న గండి కొట్టించారు. రోజుకి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గండి ప్రాంతంలో మత్స్యకారులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా.. నిన్న ప్రక్షాళన మొదలుపెట్టిన కాసేపటికే మత్స్యకారుల ఆందోళనలతో పనులు నిలిచిపోయాయి.