AP: రాష్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2.27 కోట్ల నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. కుప్పం, శ్రీకాకుళం, తుని, నాగార్జునసాగర్, అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల అభివృద్ధి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 9 అంశాలపై అధ్యయనం చేయనుంది.