టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ చిన్న విషయానికే చిరాకుపడతాడని అన్నాడు. టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. అయితే, పాంటింగ్ వ్యాఖ్యలపై గంభీర్ మండిపడ్డాడు. భారత క్రికెట్ గురించి అతడికెందుకని అన్నాడు. దీనిపై పాంటింగ్ స్పందించాడు. ‘గంభీర్ ఊరికే చిరాకు పడుతుంటాడు. మా ఇద్దరికీ కాస్త పడదు’ అని పేర్కొన్నాడు.