MBNR: రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఈఎంసి మోహన్ నాయక్ దంపతులతో గురువారం కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి గుట్ట పైకి ఇదివరకే 110 కోట్లతో ఘాట్ రోడ్డు మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ ఘాట్ రోడ్డు ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి కమిటీ సభ్యులు భాస్కరాచారి, శేఖర్, శ్రీధర్ రెడ్డి, పాల్గొన్నారు.