PPM: జియ్యమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో పాఠశాలకు వెళ్లి చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని నమోదైన పోక్సో కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించిందని మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు ముద్దాయి దుర్గారావుకు మూడేళ్ల జైలు శిక్ష రూ.2 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణిీి తీర్పు వెల్లడించారన్నారు.