VSP: సితమ్మధారలో గల ఆక్సిజన్ టవర్స్‌లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికలు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అపార్ట్మెంట్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.