జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే ఆ ప్రాంతంలో ఎవరూ రాళ్లు రువ్వే సాహసం కూడా చేయలేకపోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ధరిస్తామంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ముంబైలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు.