AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నియమితులయ్యారు. ఎమ్మెల్యే రఘురామ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ పేరును కూటమి నేతలు ప్రతిపాదించారు. దీంతో ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు ఆయనను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. కాగా, అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే.