TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYDలోని చారిత్రక చార్మినార్ పరిసరాల్లో ఆర్కిటెక్చర్ లైటింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నయాపూల్ నుంచి చార్మినార్, లాడ్‌బజార్ పరిసరాల్లో ఆర్కిటెక్చర్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రూ.18.19 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.