AP: రాష్ట్రానికి మళ్లీ వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి ముడ్రోజుల పాటు భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వానలు పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.