TG: రాష్ట్రంలో నేటి నుంచి రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. వృత్తి, ఉద్యోగాల కోసం దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటికే పూర్తయిన ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అతికించనున్నారు.