ఆరోగ్యానికి మంచిదని కొందరు రోజూ డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. వీటిలోని ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే కొన్ని డ్రైఫ్రూట్స్‌ని రోజూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులోని అధిక కొవ్వులు బరువు పెరిగేలా చేస్తాయి. బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం మోతాదు మించితే విషపూరితం అవుతుంది. హాజెల్ నట్స్, అంజీరా, పిస్తా పప్పులని మితంగా తీసుకోవాలి.