సత్యసాయి: జిల్లాలో నేడు రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని డీఈవో కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.