WGL: కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ప్రకటించినందున నేడు రెండో శనివారం వర్కింగ్ డే అని రిజిస్ట్రార్ మల్లారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కావున కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలలు, విభాగాలు పని చేయాలని, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని ఆదేశించారు.