AP: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. తాడికొండలో మాజీ మంత్రి సుచరితను తప్పించి బాలవజ్రబాబును, చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు స్థానంలో విడదల రజినిని నియమించింది. అయితే గతంలో విడుదల రజిని వైసీపీని వీడుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గ నుంచి చిలకలూరిపేటకు పంపించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.