హమాస్‌ను బహిష్కరించడానికి ఖతార్ అంగీకారం తెలిపింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపలేదు. దీంతో వారిని బహిష్కరించాలని అమెరికా సూచించింది. అందుకు అంగీకారం తెలిపిన ఖతార్.. హమాస్‌కు నోటీసులు పంపించినట్లు సమాచారం. కాగా, 2012 నుంచి ఖతార్‌లోని దోహాలో హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.