నల్లగొండ: జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ జనరల్, ఎంబీఏ టీటీఎం ఒకటి, రెండు, మూడు, నాలుగు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 200 మంది విద్యార్థులకు గాను 191(95%) మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంజీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాలు సంబంధిత వెబ్సైట్లో ఉంటాయన్నారు.