మేడ్చల్: బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌లో కంఫర్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పేద ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిని అభినందించారు.