జనగామ: జిల్లా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ అధ్యక్షుడు కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ ఆకస్మిక మృతిపట్ల సీపీఎం జిల్లా నాయకులు, ఇతర పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి ప్రజా పోరాటాలకు, సీపీఎంకి తీరని లోటు అన్నారు.