HNK: కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో భాద్రపద సోమవారం సందర్భంగా సిద్దేశ్వరుడికి పుష్పాలంకరణ చేశారు. అనంతరం సిద్దేశ్వరుడుని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేసి వారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.