NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతు పనుల ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. మంగళవారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండి పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని రేపు ఉ.6గం.ల వరకు నీరు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ ఉన్నారు.